హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి పండగ మూడు రోజులు పండగ. మకర సంక్రాంతి నాడు ఎక్కడెక్కడో ఉన్న హిందువులు అంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కలిసి ఈ పండుకుని వేడుకలా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం చూస్తే సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ వస్తుంది.
ఆ రోజునే మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాము అయితే ఈసారి పండగ ఎప్పుడు వచ్చింది అని చాలా మంది సందేహంలో పడ్డారు. 14వ తేదీన పండగ జరుపుకోవాలా లేదంటే 15వ తేదీన ఈ పండుగ జరుపుకోవాలా అని సందేహంలో పడ్డారు. ఇంతకీ మరి పండుగ ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం.
సూర్యుడు 14 వ తేదీ రాత్రి 8:44 గంటలకు మకర రాశిలోకి ప్రవేశించాడు మనం తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిధి ని పరిగణలోకి తీసుకోవాలి అందుకని 15వ తేదీన పండుగ జరుపుకోవాలి. 15వ తేదీ మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. భోగి సంక్రాతి ముందు రోజున కనుక 14వ తేదీన భోగి అయ్యింది. కనుమ పండుగ 16వ తేదీ వచ్చింది.
శుభ ముహూర్తం:
జనవరి 15న మకర సంక్రాంతి వచ్చింది. ఈరోజున ఉదయం 6:15 గంటల నుంచి దానధర్మాలు చేస్తే మంచిది. మధ్యాహ్నం 12:30 వరకు పుణ్యకాలం వుంది.
సంక్రాతి నాడు ఏం చెయ్యాలి..?
సూర్యదేవుని ఆశీస్సుల కోసం సంక్రాతి నాడు సూర్యుడి కి పూజలు చెయ్యడం మంచిది. సూర్యుడి కి పూజలు చేయడం వలన ఎన్నో లాభాలని పొందవచ్చు.
బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి పూజ కార్యకరాల్లో పాల్గొనడం మంచిది.
”ఓం గృణీం సూర్యః ఆదిత్యః ఓం హ్రీం హ్రీం సూర్యాయ సహస్రరాయ రాయ ఓం హ్రీం హ్రీం సూర్య ఓం” అనే మంత్రాలను జపించండి.
ఈరోజు సూర్య భగవానుడికి బెల్లం, నువ్వులు సమర్పిస్తే కూడా ఎంతో మంచిది.