తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన మరింత సులభతరం చేసే అవకాశాలు ఉన్నాయి. సరికొత్త విధానాల అమలుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్…. చెరువులు, ప్రభుత్వ భూములను ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు మినహా మిగిలిన వాటన్నింటికీ ఫీజు నిర్ధారణ చేయనుంది. ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేయనుంది సర్కార్. ఇప్పటికే దరఖాస్తుదారులకు ఊరట కల్పించేలా ఉత్తర్వులు ఇచ్చింది.

లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఫీజు ఖరారు చేయనున్న ప్రభుత్వం….ఎల్‌ఆర్‌ఎస్ కోసం జీవో 28 విడుదల చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 25.68 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఓపెన్‌సైట్ ఫీజు రాయితీ ద్వారా చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కలుగనుంది. ఎల్ ఆర్ ఎస్ మార్గదర్శకాలు విడుదల చేయనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌కు 200 మీటర్ల దూరంలో ఉండే ప్లాట్ల విషయంలో నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మునిసిపల్ సంయుక్త విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.