లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా జల్లికట్టు. ఈ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ అకాడమీ అవార్డులకు ఈ సంవత్సరానికి గాను భారత అధికారిక ప్రవేశ సినిమాగా దీనిని నామినేట్ చేసారు. ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్ మరియు శాంతి బాలచంద్రన్ నటించిన ఈ సినిమా ఒక కొండ మీద ఉన్న మారుమూల గ్రామంలోని కబేళా నుంచి తప్పించుకున్న ఎద్దుని వెతికే కధతో రూపొందించబడింది.
2019 అక్టోబర్‌లో కేరళలో విడుదలైన ఈ జల్లికట్టును 2019 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు 24 వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించారు. ఈ రెండు చోట్లా సినిమాకు చాలా ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు గాను పెల్లిస్సేరీ 50 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడు ట్రోఫీని కూడా అందుకున్నారు. 2011లో ఆడమింటే మకాన్ అబూ తర్వాత గత దశాబ్దంలో ఆస్కార్ అవార్డులకు మన దేశం నుండి ఆస్కార్ కి నామినేట్ అయిన రెండవ మలయాళ చిత్రం జల్లికట్టు.