అలా కావాలంటే ఇలా చేయాలి : బొత్స

-

గత కొన్ని రోజుల నుంచి పలు రకాల చార్జీలు పెంచుతూ వచ్చిన జగన్ సర్కార్ ఇటీవలె ఆస్తిపన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్ను పెంపు ఉంటుంది అని ఇటీవల జగన్ సర్కార్ స్పష్టం చేసింది. ఇదే విషయంపై మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

మొత్తం ఆస్తి విలువ పై కేవలం 0.10 శాతం నుంచి 0.50 శాతం మాత్రమే పన్ను విధిస్తున్నామూ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రస్తుతం ప్రభుత్వం ఇలాంటి తరహా నిర్ణయం తీసుకుంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలను మరింత అభివృద్ధి చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయాని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news