చార్జీలు వాళ్లకి మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన గూగుల్ పే..!

-

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్ లలో ఎక్కువమంది వినియోగదారులను కలిగి ఉన్న యాప్ గూగుల్ పే అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో రకాల సేవలను అందిస్తూ తమ కస్టమర్ల సంఖ్య రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది గూగుల్ పే. అయితే ఇప్పటి వరకు గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయడం పూర్తి ఉచితం అనే విషయం తెలిసిందే. కానీ జనవరి 1 నుంచి పేమెంట్ చార్జీలు విధించే అవకాశం ఉంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది దీంతో వినియోగదారులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

డిజిటల్ పేమెంట్ లపై ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటనపై వివరణ ఇచ్చింది. అయితే ఈ ఛార్జీలు కేవలం అమెరికా లోని వినియోగదారులకు మాత్రమే అంటూ స్పష్టం చేస్తోంది. భారత్లో ఉన్న గూగుల్ పే వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు అంటూ స్పష్టం చేసింది. దీంతో గూగుల్ పే వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు. 2021 నుంచి సరికొత్తగా డిజైన్ చేసిన గూగుల్ పే యాప్ అందరికీ అందుబాటులోకి వస్తుంది అని శుభవార్త చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news