పార్టీ ఆదేశిస్తే ఎంపీ బరిలో ఉంటా: మల్లా రెడ్డి

-

మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మనసు లో మాటలని బయటపెట్టారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. తాజాగా గోవాలో చిల్ అవుతూ కనపడిన ఆయన సంక్రాంతి పండుగ సందర్భంగా బోయినపల్లి లో పతంగులు పంపిణీ చేశారు. పతంగులు ఎగరవేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని పిల్లలకి చెప్పారు ఒకవేళ కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశిస్తే ఎంపీ బరిలో నిలుస్తాను అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పారు అభివృద్ధి అంటే కేసీఆర్ కేటీఆర్ మాత్రమే అని అన్నారు.

21న జరిగే పార్లమెంట్ పరిధి సమావేశంలో అభ్యర్థి విషయం గురించి అధిష్టానం ఆలోచిస్తుందని చెప్పారు. బోయిన్పల్లి లో జరిగిన కైట్ ఫెస్టివల్ లో మల్లారెడ్డి పాల్గొని పతంగులని ఎగరవేశారు పిల్లలతో సరదాగా గడిపారు. మల్లారెడ్డి వినోదాన్ని చూస్తున్న నెటిజెన్లు తమదైన శైలిలో స్పందించారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాల్లో ఉన్న కూడా ఆయన తీరు వేరు అని అన్నారు. కొందరైతే మల్లారెడ్డి డైలాగ్ లు అనుకరిస్తూ వ్యాఖ్యలు చేస్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version