కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయం : మల్లారెడ్డి

-

శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు సింగిల్‌ డిజిట్‌కే పరిమితవుతారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్‌పల్లిలోని మంత్రి నివాసం వద్ద ఆదివారం మేడ్చల్‌ నియోజకవర్గంలోని భోగారం, రాంపల్లి దయర గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాడిన నాటి నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాడన్నారు.

రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తప్ప కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను నమ్మె పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ బీజేపీ పార్టీల అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఇది ఇలా ఉంటె, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ ..55 మందితో కూడిన తొలి జాబితా కాంగ్రెస్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..ఇవాళ బీజేపీ 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఫస్ట్ లిస్ట్ రావడంతో ఎవరు గెలుస్తారా అని నియోజకవర్గాల్లో అంచనా వేసుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version