తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ కేసీఆర్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. తెలంగాణ కావాలని ఎందరో మహనీయులు పోరాడి తమ ప్రాణాలను అర్పించారు కానీ… దాని ఫలితాన్ని మాత్రం కేసీఆర్ ఒక్కరే అనుభవిస్తున్నారని ఖర్గే విమర్శించారు. గత ఎన్నికల్లో కర్ణాటకలో చెప్పిన విధంగానే ఇప్పుడు అయిదు హామీలను అమలు చేస్తున్నాము.. ఇప్పుడు తెలంగాణలోనూ చెప్పిన విధంగా ఆరు హామీలను కేవలం మొదటి 100 రోజుల్లోనే అమలు చేసి తీరుతామంటూ ఖర్గే చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఈ హామీలను మొదటి సారి కాబినెట్ భేటీ లోనే వాటిని ఆమోదించి తీరుతామంటూ ఖర్గే స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పంపిస్తామంటూ మల్లఖార్జున ఖర్గే నమ్మకంగా మాట్లాడారు.