మమత బెనర్జీ రాజీనామా చేయాలి.. నిర్భయ తల్లి ఆగ్రహం..!

-

కోల్ కతా డాక్టర్  ఘటన యావత్ దేశాన్ని షాక్ కి గురిచేసింది. బాధితురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయం కోసం మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణంగా
అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. మరోవైపు ఈ కేసును సరిగా దర్యాప్తు చేయని కారణంగా కలకత్తా హైకోర్టు  సీబీఐకి బదిలీ చేసింది. ప్రభుత్వం వైఫల్యం, ఆస్పత్రి నిర్లక్ష్యం, పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ హత్యలో నిందితులను ఉరి తీయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న భారీ ర్యాలీ నిర్వహించింది. బీజేపీ మాత్రం ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సీబీఐ ఆదివారం లోగా నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు “నిర్భయ తల్లి ఆశాదేవి, సీఎం మమతా బెనర్జీపై[ఫైర్ అయ్యారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. ఆమె స్వయంగా ఒక మహిళ, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశాదేవి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news