గత మూడు రోజుల క్రితం ఒడిశా రాష్ట్రము బాలాసోర్ సరిహద్దుల్లో మూడు రైళ్లు ఢీకొనడంతో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోగా , చాలా మంది గాయాలు పాలయ్యారు. కాగా ఈ ఘటనపై దేశం లోని పలు రాష్ట్రాల సీఎంలు మరియు అధికార ప్రతినిధులు తమ సంతాపాన్ని తెలియచేశారు. ఇక వెస్ట్ బెంగాల్ కు చెందిన వారు కూడా ఈ ట్రైన్ లో ప్రయాణించడంతో, ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఇందులో ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన వారికి ఉపయోగకరమైన హామీని ఇచ్చింది. ఇందులో మరణించిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది.