సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదని తెలిసింది. దీంతో మానసిక వైద్యుల దగ్గర పరీక్షలు చేయించారు.
అవును.. నమ్మలేకపోతున్నారా? అతడిలో సగం మనిషి, సగం కుక్క ఉంది. సాధారణంగా మనిషి మనిషిలా ఉంటాడు. కానీ.. ఇతడు మాత్రం ఒకసారి మనిషిలా.. మరోసారి కుక్కలా బిహేవ్ చేస్తాడు. అతడిని చూస్తే 2001 లో హాలీవుడ్‌లో వచ్చిన ది యానిమల్ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా ఓ వ్యక్తి సగం మనిషి.. సగం కుక్కలా బిహేవ్ చేస్తాడు. అయితే అది సినిమా. కానీ.. ఇది నిజం.
ఈ వ్యక్తి ఉన్నది యూఎస్‌లోని ఫ్లోరిడాలో. డాక్టర్లు కూడా అతడిని టెస్ట్ చేసి అతడిలో కుక్క లక్షణాలు ఉన్నాయని తేల్చేశారు. ఫ్లోరిడాలో ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై దాడి చేశాడు. తీవ్రంగా వాళ్లను గాయపరచడంతో పాటు కుక్కలా కరిచాడు. దీంతో వాళ్లకు అచ్చం కుక్క కరిచినట్టుగానే గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదని తెలిసింది. దీంతో మానసిక వైద్యుల దగ్గర పరీక్షలు చేయించారు. అప్పుడు అతడికి వింత జబ్బు ఉన్నట్లు తేలింది. ఈ మానసిక రుగ్మత కారణంగా అతడు తనను తాను కుక్కగా భావిస్తున్నట్లు వెల్లడైంది.
అచ్చం కుక్కలాగే ప్రవర్తించడం.. కుక్కలాగే కాలు ఎత్తి గోడల మీద మూత్రం పోయడం, ఎవరైనా కొత్తవారు కనిపిస్తే మొరగడం, ఎవరి మీదనైనా అనుమానం కలిగితే దాడి చేయడం, కుక్కలా కొరికేయడం అతడికి అలవాటుగా మారింది. అయితే.. అతడికి కుక్క లక్షణాలు రావడానికి అతడి భార్యే కారణమట. తన భార్య తనకంటే కూడా తన పెంపుడు కుక్కకే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆ వ్యక్తి కుక్కలా మారిపోయినట్లుగా సైకాలజిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.