వీడు మామూలోడు కాదు… అంగీ లోపల జాకెట్ ధరించి 24 మద్యం సీసాలు తరలించాడు. అంగీ లోపల జాకెట్ ధరించి 24 మద్యం సీసాలు తరలిస్తూ ఆబ్కారీ అధికారులకు ఓ వ్యక్తి పట్టుపడ్డాడు. మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా దేశీదారు మద్యం తరలిస్తున్నాడు ఓ వ్యక్తి. అతన్ని పట్టుకున్నారు ఆబ్కారీ అధికారులు.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన కార్డె అశోక్‌గా గుర్తించారు. తన షర్టులోపల జాకెట్ ధరించి ఏకంగా 24 దేశీదారు సీసాలు(మహారాష్ట్రకు చెందిన మద్యం) పట్టే విధంగా జేబులు కుట్టించుకొని తరలిస్తుండగా పట్టుకున్నారు ఆబ్కారీ అధికారులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
వీడు మామూలోడు కాదు
అంగీ లోపల జాకెట్ ధరించి 24 మద్యం సీసాలు తరలిస్తూ ఆబ్కారీ అధికారులకు పట్టుబడ్డ వ్యక్తి
మహారాష్ట్ర నుండి తెలంగాణకు అక్రమంగా దేశీదారు మద్యం తరలిస్తున్న వ్యక్తి
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెండల్వాడకు చెందిన కార్డె అశోక్‌గా గుర్తింపు
తన షర్టులోపల జాకెట్… pic.twitter.com/DtQtvkWs5d
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2025