టైమ్‌పాస్‌ ప్రేమతో పిచ్చోడినయ్యా.. సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య

-

విజయవాడ కృష్ణలంకకు చెందిన అబ్దుల్‌ సలాం కానూరులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని ప్రేమించాడు. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె తనను ప్రేమించినట్లు నటిస్తూ మోసం చేస్తుందని గ్రహించాడు. దాంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి వన్‌టౌన్‌ నైజాం గేటు సెంటరు సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు విజయవాడ రైల్వే పోలీసులు తెలిపారు. అతడి వద్ద ఓ సూసైడ్ నోట్‌ లభించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ పార్థసారథి తెలిపారు.

death

‘ఆమె టైమ్‌పాస్‌ ప్రేమ వల్ల పిచ్చోడినయ్యా.. నాపై ప్రేమ నటిస్తూ ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడుతోంది.. అబ్బాయిలు మోసం చేస్తే హైలెట్‌ చేస్తారు.. అదే అమ్మాయిలు చేస్తున్న మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదు’ అంటూ యువకుడు సూసైడ్‌ నోట్‌ రాసి అబ్ధుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version