పండుగ పూట విషాదం.. ఎడ్ల బండి కింద పడి వ్యక్తి మృతి

-

సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకున్నది. ఎడ్ల బండి ఊరేగింపు జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఎడ్ల బండి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామంలో చోటు చేసుకున్నది. మకర సంక్రాంతి రోజు సాయంత్రం నందివడ్డేమాన్‌లో ఎడ్ల బండ్ల ఊరేగింపును నిర్వహించారు. బండ్లన్నీ ఊరేగింపుగా వెళ్తుండగా… వెనుక నుంచి వచ్చిన ఓ ఎడ్ల బండి జనార్ధన్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో బండి చక్రం అతడి మీది నుంచి పోయింది. ఈ ఘటనలో జనార్ధన్‌కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version