ఏపీలో దారుణం : ఆస్తి కోసం తండ్రినే కిడ్నాప్ చేసిన తనయుడు !

మనుషుల మధ్య రక్త సంబంధాలు కూడా ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తీసుకుని తల్లితండ్రులను రోడ్డు పాలు చేస్తున్న అనేక మంది గురించి మనం వింటూనే ఉన్నాం. అలాంటి ఘటన ఒకటి గుంటూరు జిల్లలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండలో కిడ్నాప్ కలకలం రేగింది.

ఆస్తి వివాదం కారణంగా ఏకంగా సొంత తండ్రినే కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి. కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. తండ్రితో పాటు తన అక్క భర్తను కూడా కిడ్నాప్ చేశాడు ఒక వ్యక్తి దీంతో నిందితుడి అక్క ఫిర్యాదు చేసింది. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుడు ఎక్కడ తండ్రిని, బావను దాచాడు అనే అంశం మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.