ఇజ్రాయెల్​లో మళ్లీ కాల్పుల మోత.. ఐదుగురు దుర్మరణం

-

ఇజ్రాయెల్​లో మరోసారి తుపాకీ మోత మోగింది. ఓ ప్రార్థనాలయం వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణ చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు.

ఓ ప్రార్థనాలయం వద్ద సబ్బత్ వేడుకల్లో పాల్గొన్న పౌరులపై పాలస్తీనాకు చెందిన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న చేరుకున్న ఇజ్రాయెల్‌ దళాలు దుండగుడిని హతమార్చాయి. అంతకుముందు వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తియన్‌ శరణార్థుల శిబిరంపై దాడిచేసిన ఇజ్రాయెల్‌ సైన్యం 9మందిని కాల్చి చంపింది. అందుకు ప్రతీకారంగా అగంతకుడు ఈ దారుణానికి తెగబడ్డట్లు అనుమానం వ్యక్తమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version