గ్రేటర్ ఎమ్మెల్యేలతో ముగిసిన భేటీ.. కేటీఆర్ కీలక ప్రకటన..!

-

గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక  వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలకు కేరాఫ్ లో హైదరాబాద్ మారిందని అన్నారు. గ్రెస్ హామీలు అమలు చేసేవరకు పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని కీలక ప్రకటన చేశారు. తెలంగాణ గ్రోత్ ను  కాపాడాల్సిన బాధ్యత.. ఈ రాష్ట్రాన్ని సాధించిన తమపై ఉందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న పారిశుధ్య ఇబ్బందులు,
తాగు నీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సమస్యల
పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో రోడ్లపై బిందెలు దర్శనమిచ్చిన రోజు ఒక్కటి కూడా లేదని అన్నారు. ప్రపంచ
స్థాయి ప్రాజెక్టులు నగర రూపురేఖల్నే మార్చేశాయని తెలిపారు. కేసీఆర్ అమలుచేసిన సమగ్రమైన
ప్రణాళికలతో హైదరాబాద్లో శాంతిభద్రతలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు. కొత్త
రేషన్ కార్డుల కోసం ఏడాది కాలంగా హైదరాబాద్లోని పేదలు ఎదురు చూస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version