దేశానికి సరైన ప్రధాని దొరికారు.. దావోస్ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్  లో పర్యటిస్తున్నారు. మంగళవారం దావాస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో దేశానికి సరైన ప్రధాని దొరికారని అన్నారు. పరిపాలనపై మోడీకి స్పష్టత ఉందని కొనియాడారు. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది. కానీ ఇండియాలో రాజకీయ సందిగ్ధత లేదని అన్నారు. ప్రధాని మోడీ దార్శనికత ఉన్న నాయకుడు అని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు.. సీఐఐ కేంద్రం ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.

టాటా సంస్థ తో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం  ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్ 2047 విజన్ మేరకు ముందుకు సాగుతామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అన్ని రంగాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా సౌర విద్యుత్పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version