అత్తవారింట్లో భార్యకి ఏదైనా అయితే భర్త లీగల్ గా జవాబు ఇవ్వాలి అని సుప్రీంకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ Bobde సోమవారం అన్నారు. తన భార్య పై దాడి చేశాడన్న కేసు లో ఇది జరిగింది. కేసు నమోదు చేసిన ఒక వ్యక్తి ముందస్తు అరెస్టు బెయిల్ పిటిషన్ ను విచారించారు. ఇంతకు ముందు బెయిల్ దరఖాస్తును పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించడం తో సుప్రీం కోర్ట్ కి నిందితుడు వచ్చాడు.
రిపోర్టు ప్రకారం ఆమె భర్త పంజాబ్ హర్యానా హైకోర్టు కి వెళ్లి బెయిల్ కోసం అడిగారు. హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఆమెకు పది గాయాలు అయ్యాయి. అలానే ఐదు గాయాలు ముఖం పై, తల పై , అలానే మరి కొన్ని చోట్ల చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి.
హైకోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు కి బెయిల్ కోసం ఆశ్రయించాడు. సోమవారం నాడు తన భర్త ఆమెను గాయపరచ లేదని, అత్తమామల ఆమెని ఇబ్బంది పెట్టారని, వేధించారని చెప్పగా… దీంతో సుప్రీం కోర్ట్ ”నువ్వు ఏం మనిషివి…? అది నువ్వు చేసిన మీ తల్లిదండ్రులు చేసిన ఆమెను అలా వేధించడం తప్పు. అత్తవారింట్లో ఆమెకు ఏ గాయమైనా ప్రాథమిక బాధ్యత నీదే” అని అన్నారు.