ప్రిస్టిన కోసోవో అనే 33 ఏళ్ల వ్యక్తి సెల్ ఫోన్ ను మింగేశాడు. అప్పట్లో వచ్చిన నోకియా 3310 మోడల్ నోకియా ఫోన్ ను ప్రిస్టిన మింగేశాడు. అయితే సెల్ ఫోన్ ఎందుకు మింగాడో మాత్రం తెలియదు కానీ. మింగిన తరవాత కడుపు నొప్పి రావడం తో లబో దిబో అంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రిస్టీనా కు డాక్టర్లు స్కానింగ్ తీసి పరిశీలించగా నోకియా ఫోన్ పేగుల్లో ఇరుక్కుంది.
వెంటనే ఆపరేషన్ చేసి ఫోన్ భయటకు తీయకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన వైద్యులు ఆపరేషన్ చేసి ఫోన్ ను బయటకు తీశారు. ఫోన్ ను బయటకు తీసేందుకు డాక్టర్లు మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఒకవేయ బ్యాటరీ బయటకు వస్తే అందులో ఉండే కెమికల్స్ వల్ల వ్యక్తి ప్రాణాలు పోయి ఉండేవని డాక్టర్లు చెబుతున్నారు. ఇక సమయానికి ఆస్పత్రికి వెళ్ళడం వల్ల క్రిస్టినా బతికి పోయాడు గానీ అతడు ఫోన్ ఎందుకు మింగాడో డాక్టర్లు ఎంతలా ప్రశ్నించినా చెప్పలేదు.