అప్పుల ఊబిలో ఏపీ.. జగన్‌ సంచలన నిర్ణయం

-

అమరావతి : ఏపీ సర్కార్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో జగన్‌ సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అప్పుల, ఆర్థిక వనరులు సంకుర్చుకోవడం కోసం మరో సలహాదారుగా రజనీశ్‌ కుమార్‌ ను నియామకం చేసింది జగన్‌ సర్కార్‌. గురు గ్రామ్‌ కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌ ను కేబినెట్‌ ర్యాంకు తో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Jagan

ఇక ఈ పదవిలో రెండేళ్లు పాటు కొనసాగనున్నారు రజనీశ్‌ కుమార్‌. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడి గా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది ఏపీ సర్కార్‌. రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ను నియమిస్తూ ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇక ఠాకూర్‌ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news