నాగబాబుకు మంచు విష్ణు ఝలక్.. !

మా అసోషియేషన్‌ ఎన్నికల విజయం అనంతరం మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. నాగబాబు ‘మా’ కుటుంబ సభ్యుడని…మా పెద్దల్లో ఆయన కూడా ఒక్కరన్నారు మంచు విష్ణు. నాగబాబు రాజీనామాను ప్రెసిడెంట్ గా తాను అంగీకరించబోనని తేల్చి చెప్పారు. ప్రకాష్ రాజ్ రాజీనామాను కూడా ప్రెసిడెంట్ గా అంగీకరించబోనని విష్ణు స్పష్టం చేశారు. మా మెంబర్స్ కి సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నారని.. తనకు ఓటేసిన అందరికి కృతజ్ఞతలు చెప్పారు మంచు విష్ణు.

తమ ప్యానల్ లో అందరూ గెలవక పోవటం నిరాశగా ఉందని….అవతలి ప్యానల్ లో గెలిచిన వారు కూడా తమ వాళ్లేనని పేర్కొన్నారు. గెలుపు, ఓటములు ఎప్పుడు మనతో ఉండవని…త్వరలోనే ప్రకాష్ రాజ్ ను కలుస్తానని ప్రకటించారు మంచు విష్ణు. లోకల్, నాన్ లోకల్ పై బై లాస్ మారుస్తామని తాను చెప్పలేదని… ఇతర దేశాల వాళ్ళను కూడా మా కోరుకుంటుందన్నారు.

నాన్ తెలుగు ఫ్యాక్టర్ ఓడించింది అంటే తాను నమ్మనని చెప్పారు మంచు విష్ణు. తనను మా ఎన్నికల నుంచి సైడ్ కావాలని.. ప్రకాష్ రాజును ఏకగ్రీవం చేద్దామని చిరంజీవి తనతో అన్నారని సంచలన ఆరోపణలు చేశారు మంచు విష్ణు. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు. కాగా..  మా అసోషియేషన్‌ సభ్యత్వానికి  రాజీనామా చేస్తున్నట్లు ఈరోజు ఉదయం నాగబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.