రెబ‌ల్ స్టార్ ఆశీర్వాదం తీసుకున్న మంచు విష్ణు..!

-

మోహ‌న్ బాబు కుమారుడు హీరో మంచు విష్ణు మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మ‌ద్ద‌తును కూడ‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో ఒక్కో సీనియ‌ర్ న‌టుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మంచు విష్ణు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. విష్ణు అప్ప‌ట్లో సూప‌ర్ స్టార్ క్రిష్ణ వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న మా ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. కాగా తాజాగా విష్ణు రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజును కూడా క‌లిసారు.

ఈ సంధ‌ర్భంగా మోహ‌న్ బాబు తో క‌లిసి దిగిన ఫోటోను విష్ణు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోకు విష్ణు ఒరిజిన‌ల్ రెబ‌ల్ స్టార్ ను క‌లిశాను అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక ఫోటోలో రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు తో పాటు ఆయ‌న స‌తీమణి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే నిన్న విష్ణు న‌ట‌సింహం బాల‌య్య‌ను షూటింగ్ స్పాట్ కు వెళ్లి క‌లిసిన సంగ‌తి తెలిసిందే. మా ఎన్నిక‌ల్లో స‌పోర్ట్ చేస్తున్న న‌ట‌సింహం కు కృతజ్ఞ‌త‌లు అంటూ బాల‌య్య‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు.
http://

Read more RELATED
Recommended to you

Latest news