రావణుడిని మొదట ఓడించింది రాముడే అనుకుంటాం మనమందరం. కానీ, శ్రీరాముడి కన్నా ముందు రావణుడు మరొకరి చేతిలో ఓటమి పాలయ్యాడు. అయనే మంధాత. అవును రావణుడు తన బలలను ఉపయోగించి ఎంత ప్రయత్నించినా మంధాతను జయించలేకపోయాడు.
లంకాధిపతి రాక్షసుడైనా, మహా శక్తిమంతుడు, ధీశాలి. తన తపస్సుతో సాక్షాత్తూ శివుడినే మెప్పించి, వరాన్ని పొందుతాడు. అయితే సీతాదేవిని అపహరించి రాముడు చేతుల్లో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోతాడు.
ఇంత పరాక్రమవంతుడైన రావణుడిని ఓడించిన రాజు ఎవరా? అని మీకు తెలుసుకోవాలని ఉంది కదూ!
రావణుడిని ఓ పెద్ద యుద్ధంలో ఓడిస్తాడు మంధాత అనే రాజు. మంధాత యవనాశ్వుని కుమారుడు. భ్రుగు మహర్షి దాచిన మంత్రజలం సేవించడం వల్ల యవనాశ్వుని భార్యకు మంధాత పుడతాడు. చిన్నప్పటి నుంచే ధైర్యసాహసాలతో, యుద్ధాల్లో చేసే పోరాటాలను ఎంతో ఇష్టంతో నేర్చుకుంటాడు. అందుకే తన 12వ ఏటనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఇతని గురించి తెలిసిన రావణుడు. మంధాతను ఎలాగైనా ఓడించాలనుకుంటాడు. ఎందుకంటే తనకంటే మించిన బలవంతుడు ఉండకూడదని నిరూపించేకునేందుకు మంధాతతో యుద్ధం చేయాలని పూనుకుంటాడు రావణుడు.
యుద్ధరంగంలో..
అనుకున్న విధాంగానే మంధాతతో యుద్ధానికి దిగుతాడు రావణుడు. ఇద్దరి భీకరయుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఎలాగైనా మంధాతను ఓడించాలనుకుంటాడు రావణుడు. దీనికోసం ముందుగానే ఏర్పాటు చేసుకున్న పథకాలను ప్రయత్నిస్తాడు రావణుడు. కానీ, మంధాతుని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయలేవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రావణుడు మంధాతను ఓడించలేక పోతాడు. అయినా పట్టువిడవకుండా అతడితో అలాగే పోరాటం చేస్తూనే ఉంటాడు రావణుడు. చివరికి యుద్ధంలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు మంధాత బలాన్ని తెలుసుకున్న రావణుడు అతన్ని ఓడించడం కష్టతరమని తెలుసుకుంటాడు.
ఆ సమయంలోనే బ్రహ్మదేవుడి, ఇంద్రుడి జోక్యంతో మంధాత, రావణుడి మధ్య సంధి కుదుర్చుకుంటాడు. చివరికి ఇద్దరి సర్ది చెప్పి ఒకటి చేస్తారు.