గెలిచిన తర్వాత పార్టీ మార్తే చెప్పుతో కొట్టండి అని తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన ప్రకటన చేశారు. తాను గెలిస్తే పార్టీ మార్తానని టిఆర్ఎస్ నేతలు విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలని.. కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని రామన్నగూడెం కొత్తగూడెం వేల్పుచర్ల అడవి ఉయ్యాలవాడ కుమ్మరిగూడెం తిమ్మాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 23 ఏళ్లు చెమటోడిస్తే స్థానికుడైన నాకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆదరించిందన్నారు ప్రజలు ఓటుతో ఆశీర్వదించి స్థానికుడ్ని ఉద్యమ బిడ్డనైన నన్ను గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఇవాళ ప్రకటించే మేనిఫెస్టో చాలా బాగుందని కొనియాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారమే.. అమలు చేస్తే పదేళ్ల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఖాయమని దోషం చెప్పారు. అనంతరం కోడూరు గ్రామానికి చెందిన ఐఎన్టియుసి రాష్ట్ర నాయకులు దేశ గాని పాపయ్య గౌడ్ చంచల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది తిమ్మాపురం గ్రామంలో పార్టీలో చేరారు.
పార్టీ మారితే చెప్పుతో కొట్టండి : మందుల సామేల్
-