బ్రేకింగ్ : కొత్త కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాగూర్ అరెస్ట్ !

హైదరాబాద్ రాజ్ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు టి- కాంగ్రెస్ గవర్నర్ తమిళ్ సై అపాయింట్మెంట్ కోరింది. దేశ వ్యాప్తంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు పై గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే టి-కాంగ్రెస్ నేతలకు గవర్నర్ సౌందర్ రాజన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

దీంతో రాజ్ భవన్ పక్కన దిల్ కుషా గెస్ట్ హౌస్ లో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్, రేవంత్, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, బోసురాజు, దామోదర రాజనర్సిహ్మ, శ్రీనివాస్ కృష్ణన్, దాసోజు శ్రావణ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీధర్ బాబు, చిన్నారెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడించాలని భావించారు. దిల్ కుషా గెస్ట్ హౌస్ నుంచి రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు బయలుదేరగా అనుమతి లేదు అంటున్న పోలీస్ లు, గెస్ట్ హౌస్ గెట్ వద్ద భారీగా మోహరించిన వారందరినీ అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక ఈరోజుతో ఏఐసీసీ ఇంచార్జి మానిక్కం ఠాగూర్ హైద్రాబాద్ పర్యటన ముగియనుంది. ఈరోజు రాత్రి ఆయన చెన్నై కి పయనం అవనున్నారు.