మాతా వైష్ణోదేవి ఆల‌య ప్ర‌సాదం.. ఇంటికే డెలివ‌రీ..!

-

దేశ‌వ్యాప్తంగా ఉన్న మాతా వైష్ణోదేవి ఆల‌య భ‌క్తుల‌కు ఆ ఆల‌య బోర్డు సద‌వ‌కాశం క‌ల్పిస్తోంది. ఆ దేవి ప్ర‌సాదాన్ని భ‌క్తులు ఇక పోస్ట్ ద్వారా హోం డెలివ‌రీ పొంద‌వ‌చ్చు. ఈ మేర‌కు శ్రీ మాతా వైష్ణోదేవి ష్రైన్ బోర్డు నిర్ణ‌యం తీసుకుంది. సెప్టెంబ‌ర్ 21వ తేదీనే భ‌క్తుల‌కు ప్ర‌సాదాన్ని హోం డెలివ‌రీ ఇచ్చే స‌దుపాయాన్ని ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఈ సేవ‌లు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.

now you can get matha vaishno devi prasad at home

మాతా వైష్ణోదేవి ప్ర‌సాదం కావాల‌నుకునే వారు దాన్ని 3 విభాగాల్లో పొంద‌వ‌చ్చు. అందుకు ప్ర‌త్యేక ప్యాకేజీలు ఉన్నాయి. రూ.500, రూ.1100, రూ.2100 ప్యాకేజీల్లో మాతా వైష్ణోదేవి ప్ర‌సాదం పొంద‌వ‌చ్చు. రూ.500 ప్యాకేజీలో భ‌క్తుల‌కు 200 గ్రాముల డ్రై ఫ్రూట్స్ 1 ప్యాకెట్‌, 2 ప్యాకెట్ల మిక్స్ ప‌ర్ష‌ద్‌, 10 ప్యాకెట్ల పౌచ్ ప‌ర్ష‌ద్‌, 2 ప‌ట్కాలు, 1 ప్యాకెట్ రెడ్ ర‌క్ష సూత్ర‌, 1 ప్యాకెట్ బ్లాక్ ర‌క్ష సూత్ర ల‌భిస్తాయి.

రూ.1100 ప్యాకేజ్‌ను ఆర్డ‌ర్ చేస్తే 300 గ్రాముల డ్రై ఫ్రూట్స్ 1 ప్యాకెట్‌, 3 ప్యాకెట్ల మిక్స్ ప‌ర్ష‌ద్‌, 10 ప్యాకెట్ల పౌచ్ ప‌ర్ష‌ద్‌, మాతా కి చున్నీ 1 పీస్‌, స‌తోత్రా సంగ్రాహ్ 2 బుక్‌లెట్స్‌, ప‌ట్కాలు 4, ఎరుపు, బ్లాక్ ర‌క్ష సూత్ర‌లు ఒక్కొక్క‌టి, 5 గ్రాముల సిల్వ‌ర్ కాయిన్ ఒక‌టి ఇస్తారు. అదే రూ.2100 ప్యాకేజ్ ఆర్డ‌ర్ చేస్తే 500 గ్రాముల డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ 1, 4 ప్యాకెట్ల మిక్స్ ప‌ర్ష‌ద్‌, 20 ప్యాకెట్ల పౌచ్ ప‌ర్ష‌ద్‌, మాతా కీ చున్నీ 1 పీస్‌, స‌తోత్రా సంగ్రాహ్ 5 బుక్‌లెట్స్‌, ప‌ట్కాలు 8, ఎరుపు, బ్లాక్ ర‌క్ష సూత్ర‌లు 2 చొప్పున‌, 10 గ్రాముల సిల్వ‌ర్ కాయిన్ 1 ల‌భిస్తాయి.

భ‌క్తులు ప్ర‌సాదాన్ని ఆల‌యానికి చెందిన వెబ్‌సైట్‌లో లేదా ఫోన్ ద్వారా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. ఆర్డ‌ర్ చేసిన 72 గంటల్లోగా వారి పేరిట పూజ చేసి వారు ఎంచుకున్న ప్యాకేజ్‌ను బ‌ట్టి ప్ర‌సాదాన్ని డెలివ‌రీ చేస్తారు. ఇక భ‌క్తుల‌కు పోస్ట‌ల్ శాఖ వారు ప్ర‌సాదాల‌ను డెలివ‌రీ చేస్తారు. కాగా ఆల‌య బోర్డు వారు అక్టోబ‌ర్ 17న న‌వ‌రాత్రి ఉత్స‌వాల మొద‌టి రోజు ఓ యాప్‌ను కూడా లాంచ్ చేయ‌నున్నారు. అందులో దేవిని ఆన్‌లైన్‌లో లైవ్‌లో భ‌క్తులు ద‌ర్శించుకోవ‌చ్చు. క‌రోనా నేప‌థ్యంలో ఆల‌యానికి రాలేని వారి కోసం ఇలా ప్ర‌సాదాన్ని హోం డెలివ‌రీ చేస్తున్నామ‌ని ఆల‌య బోర్డు ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news