నేడు హైదరాబాద్ కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ రానున్నారు. సాయంత్రం 4గంటలకు గాంధీభవన్ లో ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పై చర్చ జరగనున్నట్టు చెబుతున్నారు. రేపు వరంగల్, నల్గొండ, ఖమ్మం అభ్యర్థి ఎంపిక కోసం ఈ మరో సమావేశం జరగనుంది. ఈ సమావేశాల అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
వరంగల్, నల్గొండ, ఖమ్మం కు రాములు నాయక్ పేరు దాదాపు ఖరారు అయినట్టేనని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. వరంగల్ సీటు కోసం మరో నేత బెల్లయ్య నాయక్ కూడా పట్టు బడుతున్నారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రాంగారెడ్డి అభ్యర్థి ఎంపిక పై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. పరిశీలనలో చిన్నా రెడ్డి, వంశీ చంద్ రెడ్డి, డిపి స్కూల్స్ చైర్మన్ కెవిఎన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చిన్నారెడ్డి వైపు సీనియర్లు మొగ్గు చూపుతున్నారు. వంశీచంద్ రెడ్డి కి నచ్చజెప్పి చిన్నారెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.