మణికొండ లో దారుణం: తల్లీ కూతుళ్ళ ఆత్మహత్యల్లో ట్విస్ట్

-

తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ లోని మణికొండ లో తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన కలకలం రేపుతోంది. విచారణలో కీలక విషయాలు బయటకు రావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. గతంలో కరోనా వచ్చిన సమయం నుండి అలివేలు (40) మరియు కూతురు లాస్య (14) లు ఇంటి నుండి బయటకు రాలేదని తెలుస్తోంది. అప్పటి నుండి వీరు మానసికంగా బాగా దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల ముందు వీరు చనిపోవాలని నిర్ణయించుకుని ముందుగానే భర్త సదానందం కు అయిదు వేలు డబ్బులు ఇచ్చి యాదాద్రి కి వెళ్లాయి రావాలని బలవంతంగా పంపించారట. ఆ తర్వాత ఇంటిలో ఉన్న పాత బట్టలు అన్నీ తగలబెడుతుండడంతో కొడుకు ఎందుకని అడుగగా నీకేమి తెలియదులే అంటూ మాటమార్చిందట.

కూతురు చేతిపై DO SOMETHING THAT MAKES YOU HAPPY అని రాసిందట, గోరింటాకుతో కూడా THE GAME IS STARTED అని రాసుకున్నారట. మొదటగా లాస్యను ఉరివేసి చంపినా తల్లి… ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కొడుకును కూడా చంపడానికి ప్రయత్నించినా.. నిద్ర పోతుండడంతో వదిలేసిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version