ఇక పోలీస్‌ యునిఫామ్‌లో.. మీరాబాయి చాను

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌ కు తొలి పతకం అందించిన మీరాబాయి చానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పావంటూ ఇప్పటికే దేశ ప్రధాని నుంచి సమాన్య ప్రజల వరకు అందరూ మీరాబాయి చానును అభినందిస్తూనే ఉన్నారు. అయితే..తాజాగా ఈ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు మణిపూర్‌ సర్కార్‌ మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఆమెను పోలీసు విభాగంలో ఆడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది మణిపూర్‌ సర్కార్‌. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే మీరాబాయికి ఆ రాష్ట్ర సీఎం బీరేన్‌ సింగ్‌ రూ. కోటి నగదు బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అటు ప్రముఖ ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్‌ డోమినోస్‌ సంస్థ మీరాబాయి చానుకు అద్భుత ఆఫర్‌ ను ప్రకటించింది. ఆమెకు జీవితమంతా ఉచితంగా పిజ్జా డెలీవరీ చేస్తామని ప్రకటించేసింది.