హస్తం ఎటాక్: ఆ ఎమ్మెల్యేని బుక్ చేస్తున్నారా?

-

తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి దూకుడుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అలాగే పలు అంశాల్లో కొందరు కీలక నేతలనీ కూడా రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు పలు అక్రమాలు కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అయితే ఇలా రేవంత్, టీఆర్ఎస్ టార్గెట్‌గా ముందుకెళుతున్నారు. ఇక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్‌గా ఆరోపణలు చేస్తూ ముందుకెళుతున్నారు. అన్నీ కోణాల్లో టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ తీవ్ర అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై నిరసన కార్యక్రమం నిర్మల్ చేసిన రేవంత్ రెడ్డి సైతం, ఇంద్రకరణ్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడారు.

ఇక తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్, ఆయన తమ్ముడు రమణారెడ్డి, విలేఖరి రవికిషోర్‌లు పోలీసుల అండతో బెదిరింపులకు పాల్పడుతూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ జిల్లాలో దోపిడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత విజయరమణరావు ఆరోపిస్తున్నారు. పట్టణంలో వ్యాపారులని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుకుంటున్నారని అంటున్నారు. ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యేని కాంగ్రెస్ బుక్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్‌గా గట్టిగానే రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగిస్తే, టీఆర్ఎస్‌ని దెబ్బతీయడానికి రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news