ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కరోనా వైరస్ కష్టకాలమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కూడా అత్యవసరమైతే తప్ప మిగతా సమయాల్లో ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటు ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటూ సూచిస్తున్నారు.
తాజాగా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ప్రజలందరికీ కీలక సూచనలు ఇచ్చారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు ఇంటి నుంచి బయటకు రావొద్దు అంటూ సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ చౌరస్తా లో హరే రామ హరే కృష్ణ మూమెంట్, మెగా కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన.. ఉచిత కషాయం పంపిణీ సెంటర్ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. కరోనా వైరస్ నుంచి రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రతిరోజు వేడి నీరు తోపాటు కషాయం తాగాలి అంటూ ఈ సందర్భంగా హరీష్ రావు సూచించారు. అంతే కాకుండా యోగా వ్యాయామం లాంటివి రోజు చేయడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.