మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ సామాన్య ప్రజలతో పాటు లాక్‌డౌన్ బందోస్తు విధులు నిర్వహిస్తున్న చాలా మంది పోలీసులు కూడా మహమ్మారి బారినపడుతున్నారు. గురువారం కరోనాతో ఓ పోలీసు మృతిచెందగా, ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో చనిపోయిన పోలీసుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా బారిపడ్డ పోలీసుల సంఖ్య 2557కు చేరిందని ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 74,860 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా వీటిలో 39,944 యాక్టివ్ కేసులున్నాయి. 32,329 మంది కోలుకున్నారు.