లాక్‌డౌన్ కారణంగా విధ్యార్థుల భవిష్యత్తు అయోమయంగా తయారైంది. ఎన్నో రకాల పరీక్షలు ఆగిపోయాయి. అసలు పరీక్షలు ఎప్పుడు పెడతారో కూడా అర్ధంకాని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ సదలింపుల నేపథ్యంలో ఇంజినీరింగ్ పరీక్షలపై జేఎన్‌టీయూహెచ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో బీటెక్, బీ ఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. పరీక్ష సమయం రెండు గంటలే ఉంటుందని వెల్లడించింది. ఇరవై నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ విద్యాసంవత్సరంలో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లోనే పరీక్షలు రాసుకోవచ్చని వెల్లడించింది. ఒకవేల పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.