నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్షా సమావేశం

-

నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం సమావేశం కానున్నారు. దేశంలో 10 రాష్ట్రాలు మావోయిస్ట్ ప్రభావిత జాబితాలో ఉన్నాయి. చత్తీస్గడ్, బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ జాబితాలొ ఉన్నాయి. ఈ రాష్ట్రాల పరిధిలో  మొత్తం 90 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయి. తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాత్రమే ఎక్కువ ప్రభావిత నక్సల్ జిల్లాగా ఉంది. ఈ సమావేశం కోసమే ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సీఎంతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హజరుకానున్నారు. ఈ రాష్ట్రాల్లో మావోయిస్టులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చ జరుగనుంది. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో రోడ్లు, భవనాల నిర్మాణం, వంతెనలు, ఆస్పత్రుల నిర్మాణాల వంటి అభివ్రుద్ధి పనులపై చర్చ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news