కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మావోయిస్టులు సంచలన లేఖ రాశారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న నేపథ్యంలో… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మావోయిస్టులు లేఖ రాయడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. తాము ఆయుధాలు వదిలేస్తామని తాజాగా మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ పేరుతో లేఖ విడుదల చేశారు.

మారిన పరిస్థితులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు జన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నామని ఈ లేఖలో వెల్లడించారు మావోయిస్టులు. కేంద్రం వెంటనే నెలపాటు అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించాలని కోరారు. తమ విన్నపాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో ఈ లేఖ హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.