‘మరో ప్రస్థానం’ రిలీజ్ ఫిక్స్.. మరికొద్ది రోజుల్లోనే..

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా మరో ప్రస్థానం. ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘మరో ప్రస్థానం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విగడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు నెరవేరే సమయం వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి పోస్టర్ కూడా ఊహించిన స్పందన అందుకున్నాయి. అంతేకాకుండా కొత్త అప్‌డేట్స్ కోసం ఎదురుచూడని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమాలో హీరో, హరోయిన్లు ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారు. పాత్రకు తగ్గట్టుగా చాలా నాచురల్ యాక్టింగ్ చూడవచ్చు. సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చే ప్రతి ప్రేక్షకుడు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతాడని మాకు బలమైన నమ్మకం ఉంది.

వాటితో పాటుగా సినిమా బిజినెస్ పరంగానూ దూసుకుపోతోంది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిసిన వెంటనే బయ్యర్స్ ఆఫీసు ముందు హోరెత్తి పోయారు. ప్రతి ఒక్కరు కూడా ఏరియాల వారిగా సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాకు మంచి గిరాకీ వచ్చింది. దాంతో పాటుగా ఓవర్‌సీస్‌లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ కథను ఎంచుకున్నప్పటి నుంచి మంచి ఫీల్‌ కలిగింది. ఇప్పుడు వస్తున్న క్రేజ్ చూసి మా నమ్మకం నిజమైందని అనిపిస్తోందని వారు అన్నారు.

ఇదిలా ఉంటే తనీష్, ముస్కాన్ జంటగా నటించిన ఈ థ్రిల్లర్ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాపై ప్రతి ఒక్కరిలోనూ తారాస్థాయిని మించిన అంచనాలు నెలకొని ఉన్నాయి. కథ చాలా కొత్తగా ఉందని, హీరో పాత్ర కూడా చాలా నాచురల్‌గా కొత్తగా ఉందని భావిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా తాము ఆశించిన స్థాయిని మించి ఉంటుందని ప్రేక్షకులు కూడా నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా వారి ఊహలను మించి ఉంటుందా లేదా అనేది తెలయాలంటే వేచి చూడాల్సిందే.

ఈ సినిమా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ వారు నిర్మించారు. ఒక క్రిమినల్ జర్నీగా సాగేదే ‘మరో ప్రస్థానం’. అంతేకాకుండా ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో దర్శకుడి పనితీరు, డెడికేషన్ కనిపిస్తాయని నిర్మాత అన్నారు. ఈ సినిమాలో రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.