చై, సామ్ లకు ఎక్కడ చెడింది..?

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే విడాకులపై ఇంత రచ్చ జరుగుతున్నా చైతూ గానీ, సమంత గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరో వైపు వారి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి అసలు కారణం ఏంటి అన్నదే ఇప్పుడు అందరి మెదడ్ల లో ఉన్న ప్రశ్న.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సమంత సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీ లైఫ్ కు కాస్త దూరం అవుతుందట. అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం అమల లాగా పెళ్లి తరవాత సమంత ఫ్యామిలీ ఉమెన్ గా ఉండాలని అనుకున్నారట. కానీ సమంత మాత్రం ఫుల్ బిజీగా ఉంటూ ఫ్యామిలీ కి దూరం అవుతోంది. ఈ నేపథ్యంలోనే సమంత నాగ చైతన్య విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరోవైపు విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.