తెలంగాణాలో సంచలన మాస్ కాపీయింగ్ బయటపడింది. కాకతీయ మెడికల్ కాలేజీలో హైటెక్ మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్ కు ఓ విద్యార్థి పాల్పడ్డాడు. చెవిలో మైక్రోఫోన్ పెట్టి విద్యార్థి ఒకరు పరీక్ష రాయడం సంచలనం అయింది. కళాశాల ఆవరణలో కారులో ఎలాక్ట్రానిక్ డివైజ్ తో సమాధానాలు చెప్పాడు ఒక డాక్టర్.
రెడ్ హ్యాండెడ్ గా కళాశాల సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. నవంబర్ 26, 28 డిసెంబర్ 3న మాస్ కాపీయింగ్ కు సదరు విద్యార్ధి పాల్పడినట్టు గుర్తించారు. ఆలస్యంగా మాస్ కాపీయింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి లక్షల రూపాయల డీల్ జరిగింది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.