సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఎండకు అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు విపరీతంగా వ్యాపించి ప్రమాదాల తీవ్రతను పెంచుతాయి. కానీ ఇప్పటికే వేసవికాలం ముగిసేసిందనే చెప్పాలి. అయినప్పటికీ ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. అలాగే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకేసారి ఆరు సిలిండర్లు పేలడంతో మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ఘటనలో పది పూరి ఇల్లులు దగ్దం అయ్యాయి. మంటల్లో చిక్కుకొని మైనర్ దివ్యాంగురాలు(15) నాగలక్ష్మీ అక్కడికక్కడే మరణించింది. ప్రజలందరూ అక్కడి నుంచి ఉరుకులు పరుగులు తీశారు. పరుగులు తీసిన వారి ప్రాణాలను దక్కించుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కారణాలు మాత్రం అస్సలు తెలియడం లేదు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.15వేలు, మృతి దివ్యాంగురాలు కుటుంబానికి రూ.30వేలు ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు మంత్రి నారాయణ ప్రకటించారు.