తెలంగాణలో భారీగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు

-

ఈ నెల 8వ తేదీన టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.పండిట్, పీఈటీ పోస్ట్ లని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది. గతంలో కోర్టు కేసులతో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచే పాఠశాల విద్యా శాఖ కొనసాగించింది. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధము అయింది. కోర్టులో కేసు నడుస్తుండగా మళ్ళీ ఇబ్బందులు రాకుండా చకచకా పదోన్నతుల ప్రక్రియ,బదిలీలను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి చేశారు.

అయితే, టీచర్ల బదిలీలు, పదోన్నతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పదోన్నతులు, బదిలీల్లో 18 వేల 942 మంది టీచర్లకి ప్రమోషన్ , సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ గా 17 వేల 72 మందికి పదోన్నతి పొందారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెడ్ మాస్టర్ గా 1870 మందికి పదోన్నతి లభించింది. ఇక, ఎస్జీటీ బదిలీలు మినహా టీచర్ల పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తి అయింది.

Read more RELATED
Recommended to you

Latest news