శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్‌ సీక్రెట్ మీటింగ్… ఫోటోలు వైరల్

-

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రే,డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు.మాజీ ముఖ్యమంత్రులులైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.ఏ విషయంపై మాట్లాడుకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లా వైరల్‌ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్‌ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రేను దీని గురించి ప్రశ్నించగా ..’ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఆయన సరదాగా అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని అన్నారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుకోకకుండా తామిద్దరం కలిసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news