107 ఏళ్ల యూట్యూబర్ మస్తానమ్మ ఇక లేదు

-

ఎక్కువగా యూట్యూబ్ చూసేవాళ్లకు ఈపేరుతో పరిచయమే ఉంటుంది. కర్రె మస్తానమ్మ.. వాటర్ మెలన్ చికెన్, ఇలా రకరకాల వంటకాలు చేసి నోరూరించింది కదా మస్తానమ్మ గుర్తొచ్చిందా? యూట్యూబ్ సెన్షేషన్ అప్పట్లో. ఆమె యూట్యూబ్ చానెల్ కంట్రీ ఫుడ్స్ అన్నా గుర్తొచ్చిందా? ఆ మస్తానమ్మ ఇక లేదు. ఆమె చనిపోయింది. ఆమెది ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి. అక్కడే ఆమె కన్నుమూసింది. ఆమె మరణ వార్త విని ఆమె ఫాలోవర్స్ ఆమె చివరి చూపు కోసం గుంటూరుకు తరలివెళ్లారు. ఆమె అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.

ఆమె యూట్యూబ్ లో కుకింగ్ చానెల్ కు చాలా ఫేమస్. ఆమె కుకింగ్ చానెల్ కు భారీ పాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే 12 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు ఆమె చానెల్ కు. ఆమె వయసు ఇప్పుడు 107 సంవత్సరాలు. 2016 నుంచి ఆమె వంటలను యూట్యూబ్ లో పెడుతుండేవాడు ఆమె మనవడు. అలా ఆమె ఫేమస్ అయిపోయింది. కాకపోతే ఒక సంవత్సరం నుంచి ఆమె వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ చేయడం లేదు. ఆమె అనారోగ్యం దృష్ట్యా వీడియోలు పోస్ట్ చేయలేదని.. తర్వాత ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆమె మనవడు లక్ష్మణ్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version