కాజల్ ఇంటర్వ్యూ.. మీడియా బాయ్ కాట్

-

సినిమా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కోట్లకు పడగొట్టే హీరోయిన్స్ సినిమా ప్రమోషన్స్ అనేసరికి వెనుకడుగు వేస్తారు. చెప్పిన టైంకు రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. అసలు రాని వారి సంగతి అలా ఉంచితే సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూ అని చెప్పి మీడియా వారిని గంటల కొద్ది వెయిట్ చేయించే హీరోయిన్స్ ఎక్కువ. అయితే సెలబ్రిటీస్ కోసం వెయిట్ చేయడం కామనే అయినా ఆ ఏముంది మనం వచ్చే దాకా వాళ్లే వెయిట్ చేస్తారులే అన్న ధీమా ఉంటే మాత్రం వారికి తగినట్టుగానే మీడియా వాళ్లు బుద్ధి చెబుతారు.

లేటెస్ట్ గా కవచం ప్రమోషన్స్ లో కాజల్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈరోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఉదయ, 10 గంటలకు మీడియాతో ఇంటరాక్షన్ అని చెప్పగా ఆమె తీరిగ్గా 11:45 గంటలకు వచ్చిందట. అప్పటిదాకా వెయిట్ చేసిన మీడియా వాళ్లు ఆమె రావడం చూశాక ఇంటర్వ్యూ బాయ్ కాట్ చేశారు. చెప్పిన టైం కు ఒక పావు గంట, అర్ధ గంట వరకు ఓకే కాని ఇలా గంటల గంటలు వెయిట్ చేయడం మా వల్ల కాదని అంటున్నారు.

రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా మీడియా ఇంటర్వ్యూ అని ఓ టైం చెబితే ఆమె వచ్చే సరికి రెండు గంటలు పట్టిందట. ఆమె ఎలాగు క్షమించిన మీడియా వాళ్లు ఈరోజు కాజల్ ఇంటర్వ్యూని మాత్రం బహిష్కరించారు. దీనిపై కాజల్ కూడా కాస్త డిజపాయింట్ అయినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version