హిట్ మ్యాన్ రికార్డ్ సమం చేసిన మాక్స్ వెల్

-

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్వెల్ సెంచరీ చేశారు. 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 120 రన్స్ చేశాడు. టీ20ల్లో మ్యాక్సీకి ఇది ఐదో శతకం. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (5) అత్యధిక సెంచరీల రికార్డును ఆయన సమం చేశారు. కాగా మ్యాక్స్వెల్ కొట్టిన 109 మీటర్ల భారీ సిక్సర్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.

రోహిత్ 143 ఇన్నింగ్స్ ల్లో పూర్తి చేయగా మ్యాక్సీ 94 ఇన్నింగ్స్ ల్లోనే 5 సెంచరీలు బాదారు. వీరి తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్ (4), బాబర్ ఆజమ్ (3), కొలిన్ మున్రో (3), సబావూన్ డావిజి (3) ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news