Medaram : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తుల రద్దీ

-

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.  తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన మేడారంలో  స్థానిక గిరిజన సమాజానికి రక్షకులుగా భావించే సమ్మక్క మరియు సారలమ్మ దేవతల గౌరవార్థం ఈ వేడుకను జరుపుకుంటారు.

అయితే ఈరోజు తెలంగాణలోని మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జనవరి 26 నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో భారీగా మేడారానికి తరలివస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చారని అధికారులు తెలిపారు. దీంతో జంపన్న వాగు నుంచి చింతల్ X రోడ్డు వరకు సుమారు 9 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చేనెల జాతర మొదలవనుండగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news