ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 6 నుంచి ఓటన్న అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఆయా శాఖల నుంచి అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకుంది. ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు కావడంతో అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్ల అవుతుంది. ఈ సందర్భంగా సమావేశాల్లో జగన్ చేపట్టిన పథకాలు సంక్షేమంపై అసెంబ్లీలో వివరించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా.. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. దీంతో వారికి అసెంబ్లీ స్పీకర్ నోటీసులను జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏం చర్యలు తీసుకుంటారు అనే దానిపై చర్చ కొనసాగుతోంది. స్పీకర్ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి మరి.