కొద్ది రోజుల క్రితం నుండి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ప్రాణ హాని ఉందన్న విషయం వైరల్ గా మారింది. దీనితో ఈ అంశంపై అటు బీజేపీ మరియు అధికార పార్టీ సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం ఈటల రాజేందర్ ఇంటికి మేడ్చల్ డీసీపీ వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ డీజీపీ… ఈటల రాజేందర్ ఇంటికి డీసీపీని పంపించారు. ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ లైఫ్ థ్రెట్ గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఈటల సలహా మేరకు భద్రతకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారట. ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈటలకు తగిన భారతను కల్పించనున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈటల రాజేందర్ కు వై కేటగిరీ భద్రతను ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.
కానీ ఇంకా ఇది అమలులోకి రాలేదు. మరి ఈటల ప్రాణ హాని విషయంపై కేసుకు సంబంధించి ఏమైనా అధరాలు బయటకు వస్తాయా అన్నది చూడాలి.