పవన్ పెళ్లిళ్లతో వైసీపీకి ఒరిగేది ఏంటి?

-

రాజకీయాల్లో విమర్శలు అనేవి నిర్మాణాత్మకంగా ఉండాలి..కానీ ఇప్పుడు అలాంటి విమర్శలు ఏమి లేవు…ఒకప్పుడు అలా ఉండేది గాని…ఇప్పుడు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోవడమే రాజకీయం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యక్తిగతంగా దాడి చేయడం…బూతులు తిట్టడం రాజకీయమైపోయింది. ఏపీలో దాదాపు అన్నీ పార్టీలు అలాగే ఉన్నాయి. ఇక ఇలాంటి రాజకీయం ఎవరు మొదలుపెట్టారు అంటే..చెప్పడానికి మూలమే ఉండదు..కాకపోతే ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఎంట్రీ ఇచ్చాకే ఇలాంటి రాజకీయం వచ్చిందనేది మాత్రం అర్ధమవుతుంది.

ఆ విషయం పక్కన పెడితే..ఇలా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం వాళ్ళ రాజకీయంగా ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? అంటే గత ఎన్నికల్లో బెనిఫిట్ వచ్చిందనే చెప్పాలి..కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితులు కాస్త కష్టమే.ఎంత వ్యక్తిగతంగా తిట్టిన ప్రజలకు కాస్త అన్నీ తెలుస్తున్నాయి. దాని వాళ్ళ ఇవి పెద్దగా వర్కౌట్ కావనే చెప్పాలి. అయితే వైసీపీ పదే పదే పవన్ కల్యాణ్ చేసే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం కంటే..ఆయన పెళ్లిళ్ల గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం ఎక్కువైంది.

ఇటీవల ఆయన వారాహి యాత్ర చేస్తూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే వైసీపీ అక్రమాలకు చెక్ పెడతానని, వైసీపీలో రౌడీయిజం చేసే వారి మక్కెలు విరగ్గొడతానని అంటున్నారు. ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, కల్తీ మద్యం, గంజాయి, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేకపోవడం, రోడ్లు ఇలా పలు అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నిస్తున్నారు.

కానీ వాటికి సమాధానం ఇవ్వకుండా ఆయన్ని వైసీపీ వ్యక్తిగతంగా తిడుతున్నారు.తాజాగా కూడా జగన్..చంద్రబాబు-పవన్ లపై విరుచుకుపడ్డారు. వాళ్ళకు మాదిరి తమకు రౌడీయిజం చేయడం, బూతులు తిట్టడం రాదని, దత్తపుత్రుడు మాదిరిగా నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం…నాలుగేళ్లకు ఒకసారి పెళ్ళాలని మార్చడం రాదని మాట్లాడారు. అయితే పవన్ అడిగిన ప్రశ్నలు ఏంటి..జగన్ చెప్పేది ఏంటి అని విమర్శలు వస్తున్నాయి. రౌడీయిజం చేయడం వైసీపీ నేతలకు రాదా..బూతులు మాట్లాడటం రాదా? అంటే అది ప్రజలకే తెలుసు.

ఇక పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారు..ఆయన ఆల్రెడీ దీనిపై క్లారిటీ ఇచ్చారు..తనకు సెట్ అవ్వక..ఒకరికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేసుకున్నానని ఇందులో తప్పు ఏంటి అని అన్నారు. అయినా ఈ అంశాలని ప్రజలు పట్టించుకోరు..పెళ్లిళ్లు అనేది పవన్ వ్యక్తిగతం. అలా అని పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, ఆయనకు ఓటు వేయాలని అనుకున్న వారు…వైసీపీకి ఏమి ఓటు వేయరు. కాబట్టి పవన్ పెళ్లిళ్ల గురించి మాటాడటం వాళ్ళ వైసీపీకి ఒరిగేది ఏమి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news