వందే భారత్‌ రైళ్ల తయారీకి హైదరాబాదీ సంస్థ బిడ్‌

-

ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు.. సౌకర్యవంతమైన రవాణాకు భారత్​లో కేంద్ర సర్కార్ వందే భారత్ రైళ్లను తీసుకొస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే వందే భారత్ రైలును భారత్​లోనే తయారు చేసేందుకు సన్నాహం చేస్తోంది. ఇందులో భాగంగానే అల్యూమినియం బాడీతో 100 ‘వందే భారత్‌’ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్టుకు బిడ్లను ఆహ్వానించింది.

ఇవాళ నిర్వహించిన ఈ బిడ్లలో 2 బిడ్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి హైదరాబాద్‌కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్‌ కావడం విశేషం. ఈ కంపెనీ స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌తో కలిసి బిడ్‌ దాఖలు చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన రైల్వే దిగ్గజం అల్‌స్తోమ్‌ కూడా బిడ్‌ వేసింది. ఈ రెండు కంపెనీలు రూ.30,000 కోట్ల కాంట్రాక్టు కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టు కింద 100 వందేభారత్‌ రైళ్లను తయారు చేసి, 35 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఉక్కుతో రూపొందిస్తున్న రైళ్లతో పోలిస్తే అల్యూమినియం రైళ్లు తేలికగా ఉండి, అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి. వీటిని సోనీపేట్‌లో తయారు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version